ధర్మవరం, (జనస్వరం) : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిలకం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని రేగాటిపల్లి పంచాయతీ గ్రామ రెవెన్యూ భూమిలో వైసిపికి చెందిన కొందరు ప్రభుత్వ భూమిలోని మట్టి కొండను తవ్వి కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు చేసినందుకు తన భార్య చిలకం చాయాదేవి మీద అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. కేసు విచారణకు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారన్నారు. ధర్మవరం పట్టణంలో వైసిపి నాయకులు మహిళలుపై అక్రమంగా కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. గతంలో ఈ కేసును అక్రమ కేసుగా పరిగణించిన గత ఎస్పీ ఈ కేసును పక్కన పెట్టారని అయితే స్థానిక ఎమ్మెల్యే ఈ కేసును తిరగదోడించి అక్రమంగా పోలీసులచే నోటీసులు పంపించారని ఆరోపించారు. అక్రమ కేసులతో తమను భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పట్టణంలో సాయిబాబా గుడి వద్ద ఓ స్థలాన్ని కబ్బా చేశారని దానిని ఒక వ్యాపారి కొనుగోలు చేశాడని, వ్యాపారులు ఇలాంటి కబ్బాదారులను ప్రోత్సహించవద్దని కోరారు. పట్టణ నాయకుల ఆక్రమాలు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ నాయకులు బెస్త శ్రీనివానులు, పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com