ఏలూరు ( జనస్వరం ) : అడ్డుకోబోయిన జనసేన నేతల అరెస్ట్ జగనన్న కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయిన ప్రభుత్వానికి కూల్చివేతలు మాత్రం నిత్యకృత్యాలుగా మారాయి. ఏలూరు, అశోక్ నగర్ లో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వారు చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు ఫ్రీజర్ బాక్సులు, శాంతిరథాల కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేదవారి కోసం ఉచితంగా షెడ్డు నిర్మించారు. గత పదేళ్లుగా ఇక్కడ దహన సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉన్నపళంగా ఏలూరు మున్సిపల్ అధికారులకు ఆ షెడ్డు అడ్డు వచ్చింది. ఫ్లాష్ సంస్థ నిర్మించిన షెడ్డు కూల్చివేతకు సిద్ధం కాగా., ఏలూరు జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరి అరెస్టుకి నిరసనగా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలపడంతో నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com