వైసీపీ నాయలకుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్

      ధర్మవరం, (జనస్వరం) : శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి ఐపీఎస్ ని కలిసి ఇటీవల రాజారెడ్డిపై జరిగిన దాడి గురించి ఎందుకు దాడి చేపించారో వారి యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వినతి పత్రం ద్వారా చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20వ తారీకు జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి పై జరిగిన దాడి గురించి ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ S.V మాధవ రెడ్డి ఐపీఎస్ ని కలిసి దాడి గురించి వివరించి ముఖ్యంగా ఎందుకు దాడి చేశారో ఎవరు దాడి చేపించారో తెలియచేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి దాడులు ధర్మవరంలో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని వాటన్నిటిని కట్టడి చేయాలని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ధర్మవరంలో ఉన్నటువంటి కొందరు అధికారుల మీద, అలాగే ఎవరు దాడులు చేపిస్తున్నారో వారి మీద కూడా కంప్లైంట్ చేశానని అలాగే నాపై పెట్టిన అక్రమ కేసు గురించి కూడా వివరించి వారి మీద కంప్లైంట్ చేశానని దానికి ఎస్పీ కూడా శ్రద్ధగా విని తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆబు, కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్, కార్యదర్శి బొగ్గరం శీన, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, గొట్లురు జీవి, రవి, సుధాకర్ రెడ్డి, భాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way