Logo
Date of Publish : 05 June 2023, 4:26 pm
Editor : Sake Naresh

జనసేనానిని కించపరుస్తూ వేసిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్

    సర్వేపల్లి  ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పంచాయతీలోని గేట్ సెంటర్ వద్ద పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం అనే కొటేషన్ తో ఫ్లెక్సీని వేసి వేశారు. దానిని తొలగించాలని సోమవారం మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో  అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ పలు ప్రాంతాలు, కూడళ్ళలో "పేదలకు, పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం" అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుని అవతారంలో ఉండే విధంగా పెట్టి మా అధ్యక్షులు వారిని ఆ రాక్షసుడు తినేస్తాడు అనే అర్థం వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. మా అధ్యక్షుల వారిని ఆ రాక్షసుడే కాదు కదా, ఏ రాక్షసుడు కూడా ఏమి చేయలేడని తెలియజేస్తున్నాం. పైపెచ్చు ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే తుగ్లక్ పనులు సమాజంలోని పలు వర్గాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశంగా మారే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. మీరు కనుక అధికార పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణం తొలగించకపోతే అది ప్రభుత్వ వైఫల్యం గానో, లేదా ఇటువంటి తరహా ఫ్లెక్సీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని భావిస్తూ, సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం జగన్ గారి రాక్షస రూప ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అదే ప్రాంతంలో, అదే కూడళ్ళలో మా జనసైనికులు కూడా మా ఆలోచనధోరణి పరంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మనోజ్, సంజు రాకేష్, శ్రీహరి, ఖాజా, పవన్, కార్తీక్, శశి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com