బాపట్ల జిల్లా ( జనస్వరం ) : బాపట్ల పట్నంలో చీలు రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు రాంపులు ఏర్పాటు చేయాలి. దివ్యాంగులకు బయోమెట్రిక్ విధానం ఇబ్బందిగా ఉంది కావున తీసివేయాలి. కనీస సౌకర్యాలు దివ్యాంగులు ఉద్యోగస్తులకు కల్పించాలని మా యొక్క జనసేన పార్టీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com