Logo
Date of Publish : 11 July 2023, 10:06 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి గురించి, కుటుంబ సభ్యుల గురించి తప్పుడు ప్రచారం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్

      శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మరియు వారి కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగత దూషణలు మరియు త్రప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ ఎసిపి శ్రీధర్ మరియు ఏసిపి శ్రీనివాస్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంఛార్జ్ డా. మాధవ రెడ్డి గారు మాట్లాడుతూ రాజకీయాలు గౌరవప్రదంగా ఉండాలని మరియు సమాజంలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అదేవిధంగా విమర్శలు, సద్విమర్శలు ఉండాలని కోరుకునే వారిలో పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఆ ఉద్దేశంతోనే నాలాంటి యువకులకు సైతం పార్టీలో తగిన ప్రాధాన్యం ఇచ్చి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాలపై కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలపై కావచ్చు వ్యవస్థాపరంగా, చేయాల్సిన సంస్కరణలపరంగా, సామాన్య ప్రజానీకానికి అందాల్సిన పథకాల పరంగా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను పోషిస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు ప్రతిపక్ష నాయకుడు అనే బాధ్యతతో ప్రభుత్వాన్ని సకారాత్మకమైన దిశలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు వైఎస్ఆర్సిపి పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల వాడుతున్న భాషా, అసభ్య పదజాలంను చూస్తున్నట్లయితే, సాధారణంగా రాజకీయాలపై మక్కువ ఉండి, రాజకీయాల్లోకి వచ్చిన సాధారణ యువత ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సిపి అగ్రనాయకత్వం చేస్తున్న కామెంట్లు వాడుతున్న అసభ్య పదజాలం నిజంగా అభ్యంతరకరమని, అయితే వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరించడం, సాధారణ కార్యకర్తలు సైతం, అదే భాష అదే అసభ్య పదజాలంకు ఆకర్షితులై తప్పుదోవ పడుతున్నారు. దీని కారణంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న సామాజిక మార్పు సాధ్యం కాకపోవచ్చు అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వాస్తవానికి నిజం గడప దాటే లోగా, అబద్ధం ఊరంతా తిరిగి వస్తున్నట్లుగా పదే పదే ఒకే విషయాన్ని ప్రచారం చేసి, అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం వైఎస్సాఆర్సీపీ నాయకులకు వెన్నె తో పెట్టినట్లుగా అభివర్ణించారు. వైఎస్ఆర్సిపి అగ్రనాయకత్వం మరియు అధికారుల భాష సైతం ఆక్షేపనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మరియు వారి కుటుంబ సభ్యుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా పోస్టులను పెడుతూ హైదరాబాద్ కేంద్రంగా, కొన్ని సోషలిస్ట్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరియు కొన్ని ఫేక్ ఐడి ల పేరు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వెంటనే ఆయా సోషల్ మీడియా హ్యాండిల్ అడ్మిన్లను గుర్తించి, గుర్తించిన పేజీలను నిషేధించి, ఆయా అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండేలాసామాన్య ప్రజానీకాన్ని మరియు యువతను దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత పోలీసులపై ఉన్నదని హితవు పలికారు. లేని ఎడల రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గార్లకి మరియు రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నాయకులు బి.అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, దాక్షాయిని,హనుమంతు నాయక్, సందీప్, ఉపెండర్, నరేష్, ప్రవీణ్, అక్బర్, దుర్గ ప్రసాద్ మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com