తెలంగాణ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులపై ట్విట్టర్ మరియు సోషల్ మీడియాలో హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకొని వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కూకట్ పల్లి కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ మండలి దయాకర్, కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేమూరి మహేష్, వెంకటేశ్వరరావు, సాలాది శంకర్, కలిగి నీడి ప్రసాద్, రెడ్డి సత్యనారాయణ, వెంకట్, కృష్ణారావు, మణికంఠ, కేశవ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com