జగ్గంపేట ( జనస్వరం ) : ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై చనిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షలు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు, విద్యుత్తు అధికారులు ఈ దుర్ఘటనపై ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపి భాదితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని హామీ పత్రం ఇవ్వడం జరిగింది. దీనితో భాదితుల కుటుంబ సభ్యులు, జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర నిరసన విరమించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com