Logo
Date of Publish : 30 May 2023, 3:42 pm
Editor : Sake Naresh

గాలి వాన బీభత్సంతో పంట నష్టపోయిన రైతన్నను ఆదుకోవాలని డిమాండ్

           రాజంపేట ( జనస్వరం ) :  గాలి వాన బీభత్సంగా రావడంతో సుండుపల్లి మండలంలో సుండుపల్లి గ్రామపంచాయితీ,తిమ్మసముద్రం గ్రామపంచాయితీ, తదితర గ్రామాలలో మండల వ్యాప్తంగా విపరీతమైన పంట నష్టం జరిగింది. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అక్కడ ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడుతూ ప్రకృతి రిత్యా వచ్చిన గాలికి ఎన్నో మామిడి చెట్లు నేల రాలాయి. చేతికి అందివచ్చిన పంట నోటి వరకు రాకుండా రైతులకు అపారమైన నష్టం జరిగింది. కావున ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని వారికి జరిగిన నష్ట పరిహారం చెల్లించాలని, సంభంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సందర్శించి వారికి జరిగిన నష్ట పరిహారం అంచనా వేసి ప్రభుత్వం తరపున చెల్లించాలని జనసేన తరపున డిమాండ్ చేశారు. అదేవిధంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 30,000 వేలు నుండి 40,000 వేలు వరకు నష్టపరిహారం చెల్లించాలని జనసేనపార్టీ తరపునడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు, గ్రామపెద్దలు, స్థానిక గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com