విజయనగరం ( జనస్వరం ) : జామి మండలంలో ఉన్న భీమసింగి షూగర్ ఫ్యాక్టరీనీ ఆధునీకరణం చేస్తామనే నెపంతో గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీని మూసి వేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడ్డ ఉద్యోగులు ఈ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసే రైతులు ఫ్యాక్టరీ మూతపడటం వల్ల అన్యాయాన్ని గురవుతున్నారు. కావున కొత్త పరిశ్రమలు తీసుకు రాకపోయినా పర్వాలేదు ఉన్న పరిశ్రమలు పునరుద్ధరించి వాటిని ఆధునికరించి నడపవలసిన బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోవడంతో నాయకుల లబ్దికోసం రకరకాల కారణాలు చూపుతూ ఫ్యాక్టరీ నిర్వీర్యం చేయడం జరిగింది. విజయనగరం జిల్లాకి తలమానికంగా ఉన్న ఈ ఫ్యాక్టరీని వెంటనే తెరిచి ఇక్కడున్న రైతులకు న్యాయం చేయవలసిందిగా అఖిలపక్షంలో భాగంగా జనసేన పార్టీ ఈరోజు ధర్నాలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ పై అన్ని పార్టీల నాయకులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జామి మండల నాయకులు భోజరాజు సత్యనారాయణ గారు, పివిఆర్ వర్మ రాజు గారు,డేగల ఈశ్వరరావు గారు, పిన్నింటి ఆదినారాయణ గారు, పోతల రాంబాబు, జన్నెల బాలకృష్ణ,వారాది స్వామి నాయుడు,పోలిపర్తి గోవిందా, కిలారి రాము అదేవిధంగా గజపతినగరం నియోజకవర్గం నాయకులు కలిగి పండు, పైల మహేష్, కలగల శ్రీను, ఎస్ కోట నియోజకవర్గ నాయకులు రామకోటి గారు ఫిరోజ్ గారు మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.