సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉన్న రిజర్వాయర్ సర్వేపల్లి, అలాంటి రిజర్వాయర్ వేల ఎకరాలకు సాగునీరు, రెండు మండలాల ప్రజలకు తాగునీరు, వందల కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే సర్వేపల్లి రిజర్వాయర్ అభివృద్ధి కొరకు రూ.కోట్ల రూపాయలతో రిజర్వాయర్ కట్టను మరమ్మతులు కొనసాగిస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ప్రస్తుతం చిన్నపాటి వర్షానికి రిజర్వాయర్ కట్ట పెద్దపెద్ద గోతులు పడిపోయి ఎప్పుడు తెగిపోద్దో అర్థం కాని స్థితిలో ఉంది. సర్వేపల్లి రిజర్వాయర్ కింద ఉన్న కనీసం 20 నుంచి 30 గ్రామాల వరకు రిజర్వాయర్ కట్ట గాని తెగిపోతే పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి. వేల ఎకరాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. రాష్ట్ర శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట ఆస్తవేస్తంగా గోతులు పడిపోయి ఉంటే ఇప్పటివరకు వచ్చి పరిశీలించకపోవడం సిగ్గుతో కూడిన విషయం. కట్ట తెగిపోతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి చెరువు కట్టను పరిశీలించి దీనికి వెంటనే మరమ్మతులు చేయాలి, లేకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ప్రాణా నష్టం జరిగితే ఆస్తి నష్టం జరిగితే పూర్తి బాధ్యతలు మీరే అవుతారు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి, లేని పక్షంలో జనసేన పార్టీ ఉద్యమంగా నిరసనలు, నిరాహారదీక్ష తెలియజేస్తుంది. రైతులని దిగువనున్న గ్రామాలని ఆస్తులని మూగజీవాలనే కాపాడుకునే దానికి మేము ఉద్యమిస్తాం. ఒక్కసారి వచ్చి పరిశీలించండి. కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వేచించి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఎంత నాసిరకంగా కట్ట నిర్మాణం జరిగి ఉంటే ఎందుకు మీరు పట్టించుకోలేదు ఎందుకు మీరు దృష్టి పెట్టలేదు 2024లో జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటాం మీ వల్ల కాదని పూర్తిగా మాకు అర్థమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రహీమ్, అశోక్, సుమన్, పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరీ, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com