నూజీవీడు ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బలివే గ్రామంలో రైతుల వద్ద కోర్టులో ఉన్న రైతులు స్థలాలను జగనన్న కాలనీల పేరిట ఎలా కేటాయిస్తారు అని జనసేన నాయకులు పాశం నాగబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ వారికి ఇంత వరకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతు ఇబ్బందుల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వేరే చోట స్థలం కేటాయించి న్యాయం చేయాలని మండల తహశీల్దార్ అధికారిని సుధరాణి గారికి స్పందనలో అర్జీ అందచేసి బాధితులతో కలిసి వివరించడం జరిగింది ఎమ్మార్వో గారు వారీ సమస్య పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాధితులతో పాటు మండల మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, రాజారావు, గిరి గోపి, మట్ట స్వామి, బ్రహ్మయ్య గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com