Logo
Date of Publish : 23 June 2022, 5:10 pm
Editor : Sake Naresh

ఎలుగుబంటి దాడిలో మరణించిన వ్యక్తికి 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ : పేడాడ రామ్మోహన్

            ఆముదాలవలస ( జనస్వరం ) : ఇటీవల ఈనెల 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి దాడి చేయగా ఒక వృద్ధుడు మరణించాడు. తరువాత 20వ తేదీన వజ్రపుకొత్తూరు గ్రామంలో తోటలలో పశువుల శాల నిర్మించడం కొరకు వెళుతుంటే యువకులపై ఎలుగుబంటి గుర్తు పట్టలేనoతగా ముఖాలపై తీవ్ర దాడి చేసిoది. ఎలుగును ఆపడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసి బీభత్సం స్పృష్టించింది. క్షతగాత్రులను పలాస హాస్పిటల్ తరలించి, మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్  పేడాడ రామ్మోహన్, పలాస నియోజకవర్గ జనసేన నాయకులు సంతోష్ పండా, కోన క్రిష్ణారావు, కిల్లి బాలక్రిష్ణ, కేదార్ నాథ్ గార్లు మురళి, రాజశేఖర్ భాస్కర్, కోటి మరియు తదితరులు బాదితులని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ 19న ఎలుగు దాడిలో మృతి చెందగానే స్థానిక మంత్రి, రెవెన్యూ మరియు ఫారెస్ట్, విపత్తుల శాఖ సకాలంలో స్పందించుంటే రెండోరోజు ఎలుగు దాడి చేసేది కాదు. చనిపోయిన వ్యక్తికి 5లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించింది. మృతుని కుటుంబానికి 20 లక్షలు, దాడికి గురయ్యే వారికి ఉచిత వైద్యంతో పాటు, వారు కోలుకుని పనిచేసుకునేవారకు వారికి ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి గురయిన పోతన పల్లి, తారకేశ్వరరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా వైద్య ఖర్చులు మేమే భరిస్తున్నాం అని వాపోయారు. ఒక రోజు ముందు రెవెన్యూ, ఫారెస్ట్, రెస్క్యూ టీంలు స్పందించుంటే మాకీ అవస్థ తప్పేదని బాధపడ్డారన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com