ఆముదాలవలస ( జనస్వరం ) : ఇటీవల ఈనెల 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి దాడి చేయగా ఒక వృద్ధుడు మరణించాడు. తరువాత 20వ తేదీన వజ్రపుకొత్తూరు గ్రామంలో తోటలలో పశువుల శాల నిర్మించడం కొరకు వెళుతుంటే యువకులపై ఎలుగుబంటి గుర్తు పట్టలేనoతగా ముఖాలపై తీవ్ర దాడి చేసిoది. ఎలుగును ఆపడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసి బీభత్సం స్పృష్టించింది. క్షతగాత్రులను పలాస హాస్పిటల్ తరలించి, మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్, పలాస నియోజకవర్గ జనసేన నాయకులు సంతోష్ పండా, కోన క్రిష్ణారావు, కిల్లి బాలక్రిష్ణ, కేదార్ నాథ్ గార్లు మురళి, రాజశేఖర్ భాస్కర్, కోటి మరియు తదితరులు బాదితులని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ 19న ఎలుగు దాడిలో మృతి చెందగానే స్థానిక మంత్రి, రెవెన్యూ మరియు ఫారెస్ట్, విపత్తుల శాఖ సకాలంలో స్పందించుంటే రెండోరోజు ఎలుగు దాడి చేసేది కాదు. చనిపోయిన వ్యక్తికి 5లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించింది. మృతుని కుటుంబానికి 20 లక్షలు, దాడికి గురయ్యే వారికి ఉచిత వైద్యంతో పాటు, వారు కోలుకుని పనిచేసుకునేవారకు వారికి ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి గురయిన పోతన పల్లి, తారకేశ్వరరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా వైద్య ఖర్చులు మేమే భరిస్తున్నాం అని వాపోయారు. ఒక రోజు ముందు రెవెన్యూ, ఫారెస్ట్, రెస్క్యూ టీంలు స్పందించుంటే మాకీ అవస్థ తప్పేదని బాధపడ్డారన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com