
విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ నుండి గుంటూరు బయలుదేరిన బస్సు 12వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో మరణించిన మృతుల కుటుంబ సభ్యులను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి భౌతిక దేహాలను పరిశీలించి ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని మరియు బాధిత కుటుంబాలకు అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రమాద జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని, ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబ సభ్యుల కుటుంబంలో ఒక్కరికి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం వారి కుటుంబాలకు చెల్లించాలని, గాయపడిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ విజయవాడ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.