Logo
Date of Publish : 18 October 2023, 10:50 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదం వల్ల ప్రమాదవశాత్తు కాలిపోయిన పంటకు నష్టపరిహారం అందించాలని డిమాండ్

          ధర్మవరం ( జనస్వరం ) : చిన్నూరు గ్రామంలో నిన్నటి రోజు అగ్ని ప్రమాదం వల్ల ప్రమాదవశాత్తు చుక్కలూరు రామాంజనేయులు గారి 4 ఎకరాల దానిమ్మ తోట, మరియు ఆకులు లింగమయ్య గారి 50 చీని చెట్లు, 30 ద్రాక్ష చెట్లు పూర్తిగా కాలిపోయి దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని తోట యజమానులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో వాపోయారు. తప్పకుండా వారికి జనసేన పార్టీ మేమంతా అండగా ఉంటామని అనంతరం తోటనంత పరిశీలించి సంబంధిత హార్టికల్చర్ అధికారులతో మాట్లాడి తప్పకుండా వీరిని ఆదుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రభుత్వం వెంటనే 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, కొండా దుర్గమ్మ, ప్యాదింది వెంకటేష్,కోటికి రామాంజనేయులు,బండ్ల చంద్రశేఖర్, మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com