పిఠాపురం, అక్టోబర్ 09, (జనస్వరం) : పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ, ఎండపల్లి గ్రామాలలో రబీ పంటకు ఆకుమడులు సిద్ధం చేసుకుంటున్న రైతులను డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కలిసి నీటి లభ్యతపై సమీక్ష నిర్వహించారు. వంతులవారీగా నీటి వినియోగం సక్రమంగా జరగాలని రైతులకు సూచనలు అందించారు. మదపురం, కొత్తపల్లి, కొమరగిరి గ్రామాల రైతులు నీటి సరఫరా మరింత పెంచాలని విజ్ఞప్తి చేయగా, సంబంధిత నీటిసంగం అధ్యక్షులతో చర్చించి నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ నీటిసంగం అధ్యక్షులు బసవ సత్తిబాబు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, చిత్రాడ జనసేన నాయకులు దేసినీడి సతీష్, కుక్కల బాబు, ఎండపల్లి నీటిసంగం సభ్యులు గుండ్ర జగ్గారావు, మత్సా శ్రీనివాసరావు, గుండ్ర కిశోర్, గుండ్ర బాబ్జి తదితరులు పాల్గొన్నారు. రైతులు తమ నీటి అవసరాల కోసం పిఠాపురం డెల్టా చైర్మన్ కార్యాలయం నెంబర్ 9515366262 ను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని తెలిపారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ కార్యాలయం కాకినాడ జిల్లా, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రైతులకు ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.