ఏలూరు ( జనస్వరం ) : ప్రజా వ్యతిరేక విధానాలతో నియంతలా పరిపాలిస్తున్న సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని, ఇంటి బాట పట్టక తప్పదని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అన్నారు.. పలుచోట్ల ప్రజలతో ఆయన ముఖాముఖి లో మాట్లాడారు.. ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు.. వైసిపి పరిపాలన తీరుపై వివరాలు కోరారు.. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జగన్ పరిపాలనపై ప్రజలు విసుగు చెందారని, అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయ్యాయని చెప్పారు.. అన్ని వర్గాల ప్రజలు జగన్ పరిపాలనపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.. ఆంధ్ర రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు.. ప్రజలకు సరైన పరిపాలన అందించాలంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి విజయం సాధించాలన్నారు.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని, ప్రజలపై ప్రభుత్వం అనేక భారాలు మోపుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు.. గత టిడిపి పరిపాలనలో 80% టిడ్కో ఇళ్లు పూర్తి అయ్యాయని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాలలో 20 శాతం ఇళ్ళను కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.. జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, మీడియా ఇన్చార్జి జనసేన రవి, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ధర్మేంద్ర నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, బోండా రాము నాయుడు, నూకల సాయి ప్రసాద్,వేముల బాలు తదితరులు పాల్గొన్నారు..