గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో జరుగుతున్న అరాచక , అవినీతి పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. వైసీపీ నేతలకు సంస్కారాన్ని ప్రసాదించమంటూ గురువారం స్థానిక శ్రీనివాసరావుతోటలోని స్వతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో పాటూ మంత్రుల చిత్రపటాలను సంస్కారవంతమైన త్రిబుల్ ఎక్స్ సబ్బుతో కడిగి మురికినీటితో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజమని కానీ వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హణనానికి పాల్పడుతూ రాజకీయాల్ని కలుషితం చేశారని విమర్శించారు. శృతిమించిన అసభ్యకర పదజాలంతో పాటూ ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దాడులకు సైతం తెగబడుతున్న వైసీపీ నేతల తీరు గర్హనీయం అన్నారు. మంత్రి జోగి రమేష్ ప్రతిపక్ష నేతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ప్రజలతో పాటూ సొంత పార్టీ నేతలే వైసీపీ నేతల వ్యాఖ్యల్ని నిరసిస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతల తీరుమారకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని వైసీపీ నేతల్ని నేరేళ్ళ సురేష్ విమర్శించారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ యథా ముఖ్యమంత్రి తథా మంత్రులు అన్నట్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉంది జగన్ రెడ్డి చేస్తున్న సిగ్గుమాలిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మంత్రులు సైతం భూతులతో విరుచుకుపడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం 151 మంది శాడిష్టుల చేతిలో బందీ అయిపోయిందని , ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు పనికిమాలిన మాటలు ఆపి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని లేనిపక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ , నగర కమిటీ సభ్యులు బండారు రవీంద్ర ,మెహబూబ్ బాషా ,సోమి ఉదయ్ , కొలసాని బాలకృష్ణ , శెట్టి శ్రీను , గడ్డం రోశయ్య , నండూరి స్వామి , తాడికొండ శ్రీను , వడ్డె సుబ్బారావు ,బాలాజీ , ఫణి , మారాసు అన్వేష్ , పీ రమేష్ , కాశీ , మల్లి , అలా కాసులు , తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com