చీపురుపల్లి, (జనస్వరం) : చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం చుక్కవలస గ్రామంలో సూరిబాబు, రమణ, వై.నాయుడు, ఎల్. గణేష్, ఎస్. గోపాల్ గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో 3వ రోజు జనవాణి – జన చైతన్య యాత్రలో భాగంగా చుక్కవలస గ్రామంలో ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను తీసుకెళ్లడం జరిగింది. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుంది. గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం జనసైనికులు బొడసింగి రామకృష్ణ, వినోద్ కుమార్, గేడ్డి. గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, గొర్లె శ్రీను, వి. వాసు, బి. సూర్యారావు జనసైనికులు పాల్గొనడం జరిగింది.