విశాఖపట్నం ( జనస్వరం ) : మీతో మీ కార్పొరేటర్ (సమస్యలపై కలసి పోరాడదాం) అనే కార్యక్రమంను ప్రారంభించిన విశాఖ 33 వార్డు జనసేన కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మీ. ఇందులో భాగంగా రెండవ ప్రియాంక విద్యోదయ హై స్కూల్ వీధి, వివేకానంద కాలనీ, 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటి కి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ 33 వార్డులో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సమస్యలపై కలసి పోరాడుదాం అనే కార్యక్రమం నిర్వహించామన్నారు. స్థానిక ప్రజలు సమస్యలు ఏవైనా ఉన్నా మాకు తెలియజేస్తే వాటికి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఎంతో మంది కార్పొరేటర్స్ 33 వార్డుకు పని చేసినా ప్రజల కష్టాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకం అవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(GK), వీర మహిళలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.