ఒంగోలు ( జనస్వరం ) : 14వ డివిజన్ అధ్యక్షులు ఉంగరాల మోహన్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 17వ రోజు ఒంగోలులోని 14వ డివిజన్ సంతపేటలో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజానీకం జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి కేవలం భరోసా పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని,పత్రికా ప్రకటనల్లో మాత్రమే అంతమందికి ఇస్తామని ఇంతమందికి ఇస్తామని స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతున్నారని, ఆచరణలో మాత్రం ఒక అడుగు ముందుకు పోవడం లేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా ఉందని అన్నారు. అలానే డ్రైనేజీ వ్యవస్థతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేషన్ అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన ఉలుకు పలుకు లేదు అని అన్నారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు స్థానికులతో మాట్లాడుతూ ఇప్పటిదాకా మీ ప్రాంతంలో అనేక సమస్యలు గుర్తించామని తప్పకుండా అవి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో అధికారులు దృష్టికి తీసుకొని పోయి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. దానికోసం ఎంతటి పోరాటమైనా చేయడానికి మేము సిద్ధమని హామీ ఇచ్చారు. అలానే ఈ ప్రభుత్వం స్పందించని యడల రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల,ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి నవీన్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, తన్నీరు ఉష, జనసేన నాయకులు వరద బుజ్జి, భూపతి రమేష్, చెన్ను నరేష్, అవినాష్ పర్చూరి, జనసేవ శ్రీనివాస్, చంద్ర, మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.