అనంతపురం ( జనస్వరం ) : మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డప్పు కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన అతిథులు డప్పు కళాకారులను సన్మానించారు. అనంతరం ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ మాట్లాడుతూ ప్రజలకు సమాచారాన్ని అందించే, ఫంక్షన్లలో ముఖ్య పాత్ర పోషించే డప్పు కళాకారులను గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. వారిని చిన్న చూపు చూడకుండా సమాజంలో మన తోటివ్యక్తుల్లా చూడాలన్నారు. భగత్ సింగ్ కాలనీలో మృతి చెందిన డప్పు కళాకారుడు శేఖర్ కుటుంబానికి 10,000 రూ. ఆర్థిక సహాయాన్ని ట్రస్టు తరుపున అందజేస్తామని చైర్మన్ గారు తెలిపారు. జిల్లాలోని ప్రతి పంచాయితీకి ట్రస్టు తరుపున 10 డప్పులు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజానీకానికి ట్రస్టు తరుపున భోజన సౌకర్యం కల్పించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com