అనంతపురం ( జనస్వరం ) : 46th జూనియర్ గర్ల్స్ జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు అనంతపురం నుంచి ఎంపికైన T. శారద ఎంపిక అయింది. ఈ అమ్మాయికి ఈ నెల 16 నుండి 20 వరకు ఉత్తరప్రదేశ్ లో జరుగు జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు వెళ్ళాడానికి తగినంత డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ రవాణా ఖర్చులకి కొంత నగదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో-ఆర్డినేటర్ రామంజి, హ్యాండ్ సెక్రటరీ శివశంకర్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com