అనంతపురం ( జనస్వరం ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన సీనియర్ నాయకులు దంపెట్ల శివ ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనల నుండి రచించబడిన రాజ్యాంగం వల్లే ఈరోజు భారతదేశం అనేక కులాల సమ్మేళనం అయిన భారత పౌరులందరూ సమాన హక్కులు పొందగలుగుతున్నారు. వెనుకబడిన వర్గాల వారు అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతున్నారు. అంటరానితనం నిర్మూలనకై అలుపెరగని కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకై సమ సమాజం నిర్మాణంకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ భారతదేశంలో రాజ్యాంగం అమలు చేయని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని వ్యాఖ్యానించారు. దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని ఇంకా వైసీపీ పార్టీలో కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 27 దళిత పథకాలు రద్దు చేశారు. ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుని మార్చి జగనన్న విదేశీ విద్య అని నామకరణం చేసి దళితులను అవమానించారు. ఇలాంటి వైసిపి ప్రభుత్వాన్ని కి రానున్న 2024 ఎన్నికల్లో దళితులందరూ ఓటు అనే ఆయుధంతో వైసీపీని గద్దె దింపాలి అని జనసేన పార్టీ నాయకులు దంపెట్ల శివ దళితులకు పిలుపునిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com