ధర్మవరం ( జనస్వరం ) : యశోద కాన్సెప్ట్ స్కూల్ నందు జరిగిన జిల్లా మొదటి జూనియర్ టార్గెట్ బాల్ ఛాంపియన్ చిప్ 2023-2024 పోటీలకు ముఖ్య అతిధిగా ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ పాల్గొన్నారు. ధర్మవరం యశోద స్కూల్ చెందిన హర్ష వర్ధన్ జాతీయ టార్గెట్ బాల్ పోటీలలో సెకండ్ ప్లేస్ సాధించారు. ఆ అబ్బాయికి యువత ఎంకరేజ్ మెంట్ గిఫ్ట్ గా ట్రస్ట్ తరుపున ట్రస్ట్ ఛైర్మన్ శివ 5000 రూ.బహుకరించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు బహుకరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన టార్గెట్ బాల్ అసోసియేషన్ వారిని దంపెట్ల శివ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎం.పృద్విరాజ్, హ్యాండ్ బాల్ సెక్రటరీ శివశంకర్, టార్గెట్ బాల్ బొగ్గు రవి, ఏలుకుంట్ల మాజీ సర్పంచ్ సాకే శ్రీనివాసులు ఆంద్రప్రదేశ్ జిల్లాల టార్గెట్ బాల్ కోచ్ లు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com