అనంతపురం ( జనస్వరం ) : నవంబర్ 18 నుంచి 20 వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. థర్డ్ ప్లేస్ నందు గెలుపొందిన క్రీడాకారిణులను కలిసి ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు(జనసేన సీనియర్ నాయకులు) దంపెట్ల శివ అభినందించారు. ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు అన్నిరకాల క్రీడల్లో రాణించాలని కోరడం జరిగింది. హ్యాండ్ బాల్ అనంతపురం జిల్లాకు చెందిన శారదా దేవుల అనే అమ్మాయి జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సెలెక్ట్ కావడంతో వారిని అభినందించారు. వారికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.