అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం అంబేద్కర్ భవన్ లో జరిగిన మాదిగల మహాసమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది వరకే శిక్షణ ఇచ్చిన డప్పు కళాకారులతో దాదాపు 30 మందితో సమ్మేళనం నందు డప్పు ప్రదర్శన చేయించడం జరిగింది. ఆ తరువాత డప్పు మాస్టర్ ను సన్మానించి మాస్టర్ కి 10000 రూపాయలు చెక్ ను ట్రస్ట్ చైర్మన్ శివ అందజేశారు. దంపెట్ల శివ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అక్షరాల్లో తప్ప... మనల్ని ఈ ప్రభుత్వాలు కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయని అన్నారు. మనకు ఇవ్వాల్సిన, పొందాలసిన గౌరవాన్ని ఇవ్వట్లేదు. మన పిల్లలకు రాజ్యాంగం ద్వారా కల్పించాల్సిన విదేశీ విద్యలు, నాణ్యతమైన విద్యలు ఎక్కడ ? మనం కేవలం మాదిగ మహా సమ్మేళనం అంటూ సభలు పెట్టుకొని ఇంతటితో మాట్లాడటం, చర్చించడం కాదు.... మనకంటూ, మన జాతి భవిష్యత్తు కోసం శ్రమిద్దామన్నారు. 140 కోట్ల మందికి ఒక్క అంబేద్కర్ పుడితే, మన హక్కుల కోసం, మన రాజ్యం కోసం మన జాతి అంతా కలసి ఒక అంబేద్కర్ కాలేమా అని ప్రసంగించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com