అనంతపురం ( జనస్వరం ) : 2024 నూతన సంవత్సర సందర్భంగా ముక్కోటి అంబికా సేవా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కేక్ కటింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టీ లావణ్య మాధురి గారు, ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్నవన్ని జరగాలని, ఉల్లాసంగా ఈ సంవత్సరం సాగాలని కోరుకున్నారు. అనంతరం జనస్వరం న్యూస్ వారు రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో Sc, st, ప్రజా సమాఖ్య అధ్యక్షుడు మద్దల చెరువు మల్లి, జనస్వరం న్యూస్ నరేష్, స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్, హ్యాండ్ బాల్ శివశంకర్, టార్గెట్ బాల్ రాజు, త్రో బాల్ రవి, క్రీడాకారులు, మరియు ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.