అనంతపురం ( జనస్వరం ) : గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ దళితవాడ పర్యటనకు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు దంపేట్ల శివ సందర్శించారు. దాదాపు 500 కుటుంబాలు ఉన్నాయని మా గ్రామానికి రావాలని మరీ ముఖ్యంగా గ్రామస్తులు కోరడం జరిగింది. అంతరించిపోతున్న తప్పేట కళాపోషణను ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. అక్కడికి వెళ్లి వారితో మాటామంతి పూర్తిచేసి వారికి రాబోయే ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని తప్పెట్లు మంజూరు చేస్తానని ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ తెలియజేశారు. ట్రస్టు ద్వారా తన వంతు సాయం అన్ని విధాల అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వీరాంజి ముఖ్య అతిథులుగా మహాజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధార్థ బాబు, ట్రస్ట్ కోఆర్డినేటర్ రామాంజనేయులు, ట్రస్ట్ సభ్యులు తరుణ్ కుమార్, మధు, రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com