అనంతపురం ( జనస్వరం ) : బత్తలపల్లి మండలం D.చెర్లోపల్లి గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ ముఖ్య అతిథిగా వచ్చి భూమి పూజ నిర్వహించారు. అనంతరం విగ్రహా నిర్వహణ గూర్చి కొన్ని సూచనలు, సలహాలు చెర్లోపల్లి కాలనీ పెద్దలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో sc, st ప్రజా సమాఖ్య అధ్యక్షులు మద్దలచెరువు మల్లి, హ్యాండ్ బాల్ సెక్రటరీ శివశంకర్, చెర్లోపల్లి పల్లి sc కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com