గుంటూరు, (జనస్వరం) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి , పేదల పక్షపాతి, దేశ రాజకీయాల్లో విలువలకు నిలువెత్తురూపం దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని, భారత దేశ ప్రజాస్వామ్య కీర్తిపతాకానికి ప్రత్యక్ష నిదర్శనం దామోదరం సంజీవయ్య అని రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి షేక్ నాయబ్ కమల్ అన్నారు. సోమవారం దామోదరం సంజీవయ్య శతజయంతి వేడుకలను జనసేన పార్టీ దళిత నాయకుడు కొండూరు కిశోర్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ కమల్ మాట్లాడుతూ అణగారిన వర్గంలో పుట్టి అసాధారణ ప్రజానాయకుడిగా ఎదిగి, నీతి నిజాయితీలే పునాదిగా రాజకీయాల్లో రాణించిన గొప్ప నాయకుడు సంజీవయ్య అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల బాధలు, కష్టాలు తెలిసిన సంజీవయ్య పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని, ఇప్పుడు ప్రభుత్వాలు అందిస్తున్న వృద్ధులకు పింఛన్, ఉచిత నిర్బంధ విద్య, మధ్యాహ్న భోజన పధకం లాంటివన్ని ఆయన ప్రాంభించినవేనన్నారు. సంజీవయ్య ఏనాడు రాజకీయాల్ని, పదవుల్ని తన సొంతానికి వాడుకోలేదని, ఎంత ఎత్తు ఎదిగినా తన జీవిత పర్యంతం నిరాడంబరంగానే జీవనాన్ని కొనసాగించారని జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు కొనియాడారు. ఇటువంటి మహానుభావుల త్యాగాలను రాష్ట్రాన్ని పాలించిన వారు పట్టించుకోకపోవడం దారుణమని, భావితరాలకు సంజీవయ్య జ్ఞాపకాలను అందించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటి రూపాయలతో సంజీవయ్య స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్రగుంట మల్లిక అన్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య జన్మించిన కర్నూల్ జిల్లాకు సంజీవయ్య కర్నూల్ జిల్లాగా పెట్టాలని జనసేన పార్టీ తరుపున మరోసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని మల్లిక తెలిపారు. తొలుత సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నక్కల వంశీ, కొప్పుల కిరణ్, నారదాసు ప్రసాద్, శివన్నారాయన, ఆళ్ళ హరి, యడ్ల నాగ మల్లేశ్వరరావు, శేషు, అరుణ, మధులాల్, మహబూబ్ సుభాని, సైదయ్య, జడా సురేష్, మారాసు శేఖర్, శీలం మోహన్, పాండు రంగారావు, కొడిదేటి కిషోర్, కిరణ్, నాని, శ్రీనివాస్, బుడంపాడు కోటి, రవి తదితరులు పాల్గొన్నారు.