Logo
Date of Publish : 04 April 2022, 3:22 pm
Editor : Sake Naresh

దళితులంటే తోట త్రిమూర్తులుకు ద్వేషం : మండపేట జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

       మండపేట ( జనస్వరం ) : రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందించనున్నారని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండపేట బాబు అండ్ బాబు కనవర్షెన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న మరణాలపై ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళుతుందని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఏడురోజులలోగా అందించాలని జీవో చెబుతున్నా ఇప్పటికీ అందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మండపేట నియోజకవర్గంలో అయిదు గురు కౌలు రైతులు మరణించగా అందులో ఒకరికి మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందిందని మిగిలిన వారి కుటుంబానికి జీవో నెంబర్ 43 ప్రకారం రావలసిన ఆర్థిక సాయం ఇప్పటికీ అందలేదని దీంతో చనిపోని రైతు కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పార్టీ అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

దళితులంటే తోట త్రిమూర్తులుకు ద్వేషం... వల్లూరు వివాదంపై న్యాయవిచారణకు సిద్ధమా??

        తోట త్రిమూర్తులకు దళితులంటే ద్వేషమని ఆరోపించారు. ఆయన కార్యాలయంకు వెళితే కనీసం కుర్చీ కూడా లేకుండా దళిత ప్రజా ప్రతినిధులను అవమనపరుస్తారని ప్రచారం ఉందని ఆరోపించారు. వల్లూరు గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న  జనసేన దళిత మహిళా సర్పంచ్ ను ఎమ్మెల్సీ దూషించిన ఫుటేజ్ పై ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. దీనిపై వల్లూరులో ప్రతి గడప నుండి తోట వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారని పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మండపేట విచ్చేస్తారని స్పష్టం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com