ఒంగోలు ( జనస్వరం ) : ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి మెప్పు పొందటానికి ఆదిమూలపు సురేష్ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యానించడం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు ప్రజల్ని పల్లకీ ఎక్కించడానికి జనసేన పార్టీ పని చేస్తుందని. పవన్ కళ్యాణ్ కి ఒక జండా ఎజెండా లేదు ఇతని పల్లకి ఎక్కించడానికి జనసేన పార్టీ పనిచేస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించడం మంత్రిగారి దిగజారుడుతనానికి నిదర్శనం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రం మొత్తం మీద దాదాపు నాలుగు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు ప్రభుత్వం తరఫున వారికి భరోసా కల్పించకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండడం కోసం కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్ రాజ్ గారు మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ఆర్ జలకళ పేరుతో ఉచిత బోర్లు వేపిస్తానని హామీ ఇచ్చి రైతులను నిలువునా మోసం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైయస్సార్ బీమా కింద అందించాల్సిన ఏడు లక్షల రూపాయలు కూడా అందించాలి వస్తుందని ఆ మరణాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఆదిమూలపు సురేష్ గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖలో దాదాపు 1800 కోట్ల పైచిలుకు అవినీతి జరిగిందనేది సమాచారం. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకుని వారికి ఇచ్చిన శాఖని వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా చేయాల్సిందిగా మంత్రిగారు సూచిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు.