Search
Close this search box.
Search
Close this search box.

దళిత ద్రోహి సీఎం జగన్ : పోతిన మాహేష్

సీఎం జగన్

       విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 41వ డివిజన్ అధ్యక్షులు కురాకుల సురేష్ ఆధ్వర్యంలో భవానిపురం , ఔట్ ఏజెన్సీ వద్ద నుండి ప్రారంభించి ఔట్ ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో లో పర్యటించడం జరిగింది. మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవానిపురం అవుట్ ఏజెన్సీ లోని అంబేద్కర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని ఈకార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలు అనేకం చెప్పుకుంటున్నారని అందరూ కూడా ఈ ప్రభుత్వం పెట్టే బాధలు పడలేకున్నామని, ఇంతవరకు ఇల్లు పట్టాలు ఇవ్వలేదని, తమ సమస్యలు చెప్పుకుందాం అంటే సచివాలయం సిబ్బంది సరిగా స్పందించడం లేదని, మంచినీటి కుళాయిలకు సంబంధించి రోడ్లన్నీ కూడా గోతులు తవ్వేసి వాటిని పూడ్చకుండా వదిలేసారని అదేవిధంగా వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా ముంపుకి గురవుతుందని ఈ సమస్య గురించి గత సంవత్సరం నుండి స్థానిక కార్పొరేటర్ మరియు ఎమ్మెల్యే గారికి అనేక సందర్భాల్లో చెప్పుకున్న స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని అదేవిధంగా గడపగడప కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వం ఇంటింటికి తిరిగి చేసింది ఏంటంటే ఉన్న పెన్షలు తీసేయడం, రేషన్ కార్డులు రద్దు చేయడం , సెంట్ భూమి పథకం పొందే వారిని అనర్హులుగా చేయడానికి తిరిగారే తప్ప వారు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎక్కడా కూడా తిరగలేదని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ వాడని అనుకోవడం లేదని, జగన్మోహన్ రెడ్డి గారు మా వాడు అనుకుని ఒక్కసారి అవకాశం ఇస్తే మమ్మల్ని అన్ని విధాల ముంచేసాడని ఇటువంటి వ్యక్తికి గనక మరొక్కసారి అవకాశం ఇస్తే పక్క రాష్ట్రాలకు పారిపోవాలని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితుల్ని దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకంటే వారికున్నటువంటి 27 పధకాలును రద్దు చేసిన దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పధకం రద్దు చేయించడంమే కాకుండా ఆపథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ విదేశీ పథకం అని పేరు మార్చేశార అంటే ఈయన ఎంత దుర్మార్గుడో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని, ఇతని వల్ల ఏ వర్గానికి కూడా మేలు జరిగింది లేదని ఈ నిరంకుశ పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ కూడా ఇంకా రోడ్ల మీదకు వచ్చి ధైర్యంగా కొన్ని సమస్యలన్నా చెప్పుకుంటున్నారంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మాత్రమే అని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పరిపాలన ముందు మనం అందరం కూడా మోకరిల్లాల్సి వచ్చేదని ప్రజలందరూ ఎవరు కూడా రోడ్లమీద తిరిగే పరిస్థితి ఉండేది కాదని అటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు మనం స్వేచ్ఛగా గొంతెత్తి మాట్లాడుతున్నామంటే అది కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనేనని అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఒక జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టి ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అదేవిధంగా అంబేద్కర్ గారి పేరును వివాదాల్లోకి లాగినటువంటి దుర్మార్గుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు బహుజనలు మరియు అట్టడుగు వర్గాలు వారెవరు కూడా ఇష్టపడడం లేదని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారని ఇటువంటి వ్యక్తి అంబేద్కర్ గారికి నివాళులర్పించే అర్హత లేదన్నారు.
              డివిజన్ అధ్యక్షులు కురాకుల సురేష్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమనకు స్పందన చాలా బాగుందని ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు ఇదొక వేదిక లాగా ఉపయోగపడుతుందని సచివాలయం పక్కనే సమస్యలు పరిష్కరించలేకపోతున్నారని స్థానిక కార్పొరేటర్ ఎన్నికల తర్వాత కనపడడం లేదని స్థానిక సమస్యల పరిష్కారం కోసం తప్పక జనసేన పార్టీ తరుపున పోతిన మహేష్ గారి నాయకత్వం లో కృషి చేసి వారందరికీ అండగా నిలబడతామనన్నరు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జోషి గారితో కలిసి ఔట్ ఏజెన్సీ చివర ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి స్థానిక డివిజన్ అధ్యక్షులు కూరాకుల సురేష్ , కమిటీ సభ్యులతో , జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించినారు. జై భీమ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక వేదిక తరపున నిర్వహించిన 132వ జయంతి కార్యక్రమంలో పోతన వెంకట మహేష్ గారు 41 వ డివిజన్ అధ్యక్షులు కురాకుల సురేష్ కలిసి పాల్గొన్నారు. మహేష్ కు అంబేద్కర్ సామాజిక వేదిక వారు జై భీమ్ నీలికండవాలు వేసి సాధారణంగా ఆహ్వానించినారు అనంతరం మహేష్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అంబేద్కర్ గారిని ఒక వర్గానికి పరిమితం చేయడం సముచితం కాదని వారు ఆర్థిక వ్యవహారాల పైన కార్మిక విధానాల పైన మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, పారిశ్రామిక విధానం కోసం అధ్యయనం చేసి గ్రంథాలు రచించి సమాజంలో మార్పుల కోసం ఎనలేని కృషి చేశారని అందుకే ఆయన ప్రపంచానికే ఆదర్శ వ్యక్తి అయ్యారని, అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం వలన నేడు దేశంలో ప్రతి ఒక్కరు సమానమైన హక్కులు పొందుతున్నారని అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు ఆచరించి జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలాలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సోమి గోవింద్ , జెల్లీ రమేష్,ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్ ,కొరగంజి వెంకటరమణ, బొమ్ము రాంబాబు, కోరాకుల సురేష్ ,సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి , తిరుపతి అనూష, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, పాల రజిని, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way