విజయనగరం ( జనస్వరం ) : 10 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మరియు విజయనగరం జిల్లా జనసేన పార్టీ ప్రసార కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలో ఉన్న దళిత సత్తా క్యాడర్ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా యువత కార్మికులు రైతులు అందరూ కూడా పాల్గొని సభ ని విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీకి దళిత సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు.