
అమలాపురం ( జనస్వరం ) : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ దళిత నాయకులు దామోదర సంజీవయ్య గారి ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే గాక కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోని దళితులంతా రుణపడి ఉంటారని అమలాపురం జనసేన దళిత నాయకులు అన్నారు. దళితుల ఆత్మగౌరవం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి యావత్ దళిత జాతి రుణపడి ఉంటుందని అన్నారు. అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం దళితులు పెద్ద సంఖ్యలో అమలాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.