అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి గ్రామ పంచాయితీ 4వ వార్డు మెంబెర్, దళిత మహిళ మన్నల వరలక్ష్మి ఉపసర్పంచ్ గా ఎన్నికయిన విషయం తెలిసిందే. దళితుల ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర MRPS అధ్యక్షులు బి.సి.ఆర్ దాస్ విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ రిజర్వేషన్ ప్రతిఫలంగా ఈరోజు ఒక దళిత మహిళ గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ గా ఎన్నిక కాబడింది. కావున ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాల వెంట నడిచి ఆయన భావాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వరలక్ష్మి గ్రామ పంచాయతిని అభివృద్ధి పథంలో నడిపించి రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనా విధానాన్ని తెలుసుకొని ఆయన పథంలో నడుస్తూ ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. వరలక్ష్మి మాట్లాడుతూ నన్ను స్థానిక ఎన్నికల్లో గెలిపించి ఉప సర్పంచ్ గా నిలబెట్టిన స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు. నిజాయితీగా గ్రామ అభివృద్ధి కోసం పాటు పడుతూ పంచాయతీని ఉన్నత స్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అందరికి చేరేలా చొరవ తీసుకుంటానని అన్నారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలలో నా వెంట నడిచి నాకు అండదండలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ గా నియమించిన ప్రతి ఒక్క నాయకునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్రా కమిటీ అధ్యక్షుడు హెచ్. రాయుడు, నరసింహ, మున్నా, మాలరాయుడు, బాల నారాయణ, జ్యోతి ఆర్ట్స్ రాము, భీమన్న, ఆచి మసాలా నరసింహ, రామాంజి, నాగేంద్ర, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com