నరసరావుపేట, (జనస్వరం) : నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మెమోరండం ఇవ్వడానికి బయలుదేరిన సయ్యద్ జిలానిని గడియార స్తంభం సెంటర్ లోనే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తుండగా పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. జిలాని మాట్లాడుతూ కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడానికి పర్మిషన్ అవసరం లేదని పోలీసులు ఎంత అడ్డుకున్న మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మెమోరాండం ద్వారా కలెక్టర్ కి తెలియజేస్తాం అని కలెక్టర్ కార్యాలయం వైపు ముందుకు సాగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారిరువురి మధ్య తోపులాట జరిగింది. అయినా సరే జిలాని జనసైనికులు కలెక్టర్ కార్యాలయం వైపు దూసుకొని పోతుండగా పోలీసులు అత్యుత్సాహం చూపి జిలాని గారి మీద జనసైనికులు మీద దాడి చేసినారు. ఈ సంఘటనలో సయ్యద్ జిలానికి స్వల్పగాయాలయ్యాయి. అయినా గాయాల సైతం లెక్క చేయకుండా ముందుకు సాగి పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ కార్యాలయంలో కి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళిన తనమీద పోలీసులు దాడి చేయటాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. అలాగే జిలాని మాట్లాడుతూ పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ.. అక్క ..చెల్లి.. అవ్వా అంటూ రాష్ట్రమంతా తిరిగి మహిళలకు రక్షణగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో రోజుకో ఆత్యాచారం, హత్య జరుగుతుంటే పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో సేద తిరుతున్నాడని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నరసరావుపేట కలెక్టరేట్ ఎదురుగా తలపెట్టిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అధికార పార్టీ నాయకులే అత్యాచారాలకు ఒడికడుతున్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. చిన్న పిల్లలను కూడా వదలడం లేదన్నారు. రాష్ట్రంలో ఎదో ఒక మూల మహిళలు అత్యాచారానికి బలవుతున్నా హోంమంత్రి, మహిళ కమిషన్ చోద్యం చూస్తూ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. తల్లిదండ్రులు సరిగాపెంచకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని హోం మంత్రి మాట్లాడం సిగ్గుచేటని, ఇటువంటి వారు ప్రజల్ని పాలించడం దౌర్భాగ్యమని జిలాని అన్నారు. దశ దిశ లేని దిశ చట్టంతో ఎవరికి ప్రయోజనం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మొద్దు నిద్ర విడి రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తిన ఉద్యమం చేస్తామన్నారు. మహిళలకు అండగా జనసేన పార్టీ పవన్ కల్యాణ్ అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి ఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ బాబు, బెల్లంకొండ ఈశ్వర్, వీరవల్లి వంశీ, Sk అధ్రుఫ్, కృష్ణంశెట్టి గోవింద్, అచ్చుల సాంబశివరావు, భాష, ఖాజా, ఉస్మాన్, వీరమహిళలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు.