అరకు ( జనస్వరం ) : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో విసుగు చెందిన యువత జనసేన పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా అరకు నియోజకవర్గం హుక్కుంపేట మండలంలోని డాబవలస గ్రామ యువత మండల నాయకులైన బలిజ.కోటేశ్వర పడాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. వారికి అరకు జనసేన పార్టీ ఇన్చార్జి చెట్టి.చిరంజీవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సందర్భంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు, కార్యనిర్వహణా కమిటీ సభ్యులు పరధానిసురేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com