Logo
Date of Publish : 14 September 2021, 1:10 pm
Editor : Sake Naresh

కరెంట్ బిల్లులు బాదుడే బాదుడు…. : రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముకరం చాంద్

                రాజంపేట ( జనస్వరం ) : కరెంట్ బిల్లు బాదుడుతో వైసీపీ సర్కార్ కొత్త షాక్ ఇస్తోందని జనసేన రాష్ట్ర కార్యదర్శి రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ ముకరం చాంద్ అన్నారు. చిట్వేలి మండల కేంద్రంలో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొత్త షాక్ ఇస్తుందని ముకారంచాంద్ తీవ్రంగా ధ్వజమెత్తారు. నిరంతర ప్రక్రియగా అదనపు వసూళ్లుకు ఆరు సార్లు విద్యుత్ పెంచి 11500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారు అని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీలు పెంపు చేయమని అప్పట్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని విస్మరించారని ఎద్దేవా చేశారు. మాదాసు నరసింహులు, పురం సురేష్ మాట్లాడుతూ ఇళ్లల్లో దీపాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యుత్ ఛార్జీలు బిల్లు చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. కరెంటు వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వస్తున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నారు. బిల్లు చూస్తే ఇప్పుడు వేల రూపాయలు కరెంట్ బిల్లులు వస్తున్నాయి. సామాన్య ప్రజలు వీటిని ఎలా చెల్లిస్తారని మాదాసు నరసింహులు అన్నారు.  ఈ కార్యక్రమంలో చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహులు, పురం సురేష్ మరియు ప్రకాష్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com