
రాజంపేట ( జనస్వరం ) : కరెంట్ బిల్లు బాదుడుతో వైసీపీ సర్కార్ కొత్త షాక్ ఇస్తోందని జనసేన రాష్ట్ర కార్యదర్శి రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ ముకరం చాంద్ అన్నారు. చిట్వేలి మండల కేంద్రంలో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొత్త షాక్ ఇస్తుందని ముకారంచాంద్ తీవ్రంగా ధ్వజమెత్తారు. నిరంతర ప్రక్రియగా అదనపు వసూళ్లుకు ఆరు సార్లు విద్యుత్ పెంచి 11500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారు అని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీలు పెంపు చేయమని అప్పట్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని విస్మరించారని ఎద్దేవా చేశారు. మాదాసు నరసింహులు, పురం సురేష్ మాట్లాడుతూ ఇళ్లల్లో దీపాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యుత్ ఛార్జీలు బిల్లు చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. కరెంటు వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వస్తున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నారు. బిల్లు చూస్తే ఇప్పుడు వేల రూపాయలు కరెంట్ బిల్లులు వస్తున్నాయి. సామాన్య ప్రజలు వీటిని ఎలా చెల్లిస్తారని మాదాసు నరసింహులు అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహులు, పురం సురేష్ మరియు ప్రకాష్ పాల్గొన్నారు.