Logo
Date of Publish : 20 March 2026, 9:25 am
Editor : Sake Naresh

ఆయుర్వేద మొక్కలతో ప్రత్యేక వనాల పెంపకం

- వినూత్న కార్యక్రమానికి సిఈఓ ఆవుల శ్రీకారం
- ఏపీఎంఏపీ బోర్డు చొరవతో ప్రయోగాత్మక యత్నం

విజయవాడ, కాకినాడ, మార్చి 19, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీబి) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామం ప్రయోగాత్మక యత్నానికి వేదికైంది. ధన్వంతరి సహస్రాయు పీఠం, రామ కపీశ్వర ఆదివాసీ సొసైటీ ఆధ్వర్యంలో, ఏపీఎంఏపి బోర్డు సహకారంతో సరికొత్త అంకురం మొదలైంది. మూడు ఎకరాల్లో శ్రీ పూజలమ్మ ఆయుర్వనం, 0.52 ఎకరాల్లో గణపతి వనం, 2.48 ఎకరాల్లో ఆయుర్వేద మొక్కలతో అడవిని పెంచడానికి సర్వం సిద్ధమైంది. ధన్వంతరి సహస్రాయుధం వ్యవస్థాపన చైర్మన్ రవి వర్మ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎంఏపి బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు. అతిథులుగా బోర్డు ఉప సీఈవో ప్రదీప్, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమండ్రి నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ చలమయ్య, ఉద్యాన శాఖ ఏడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోడు వ్యవసాయం చేసే గిరిజన రైతులకు ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట వల్లి సుబ్బరాజు, రఘురామరాజు, ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర రావు, ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వి. సత్య రామచంద్రరావు, స్థానిక రైతులు కోరుకొండ వెంకన్న, కోరుకొండ కళ్యాణ్, కొల్లు రామకృష్ణ, కమ్మిల సత్తిబాబు, కమ్మిల వీరయ్య, కాపు, మార్నిది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com