Logo
Date of Publish : 19 September 2022, 2:47 pm
Editor : Sake Naresh

రాజకీయాల్లో క్రౌడ్ ఫండింగ్ రాజ్యమేలాలి : Dr యుగంధర్ పొన్న

        చిత్తూరు ( జనస్వరం ) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం లో సుందరాంగి పల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఒక సిద్దాంతం కోసం భావజాలాన్ని నమ్మి ఒక సమూహం మొత్తం ముందుకు వెళ్తే అది పెను మార్పునకు నాంది పలుకుతుందని, రాజకీయాల్లో ఇలాంటి గొప్ప లక్ష్యం సాధించడం కోసం ముందుకు వెళ్లే క్రమంలో క్రౌడ్ ఫండింగ్ అనేది అందరినీ కలిపి ఉంచే ఒక ఆర్థిక మంత్రమని తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పార్టీలో బలమైన భావజాలాన్ని, బాధ్యతనూ ప్రతి ఒక్కరూ పంచుకునే అవకాశం ఉంటుందని, పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ, జవసత్వాలను అందిస్తూ, సుదీర్ఘ ప్రయాణంలో తోడున్నామని చాటి చెప్పే ప్రక్రియ క్రౌడ్ ఫండింగ్ అని తెలియజేసారు. రాజకీయ పార్టీలో క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక పార్టీ నమ్మిన సిద్ధాంతాన్ని తమ ఉమ్మడి సిద్ధాంతంగా సాధారణ ప్రజలు భావించి, ఆ పార్టీ మనుగడ కోసం వారు కూడా భాగస్వాములు కావడమే క్రౌడ్ ఫండింగ్ అని, ఒక సమూహం తాలూకా వ్యక్తిగత సొమ్ము పోగు చేయడం సులువైన పనని, దీంతో పాటు ఒక్కరి పైనే పడే ప్రత్యేకమైన ఆర్ధిక భారం కూడా తగ్గుతుందని, ఇది పార్టీలో క్రమశిక్షణకు కూడా ఉపయోగ పడుతుందని ఉద్ఘాటించారు. ఒక రాజకీయ పార్టీకి వచ్చే క్రౌడ్ ఫండింగ్ వల్ల ఆ పార్టీ బలం, భావజాలం ఎంతగా ప్రజల్లో ఉన్నాయో అర్ధం అవుతుందని, ఖర్చు చేసే ప్రతి రూపాయికి పారదర్శకమైన లెక్కలు చూపించడం వల్ల మరింత బలం చేకూరుతుందని తెలిపారు. మనకోసం పనిచేసే నాయకుడికి క్రౌడ్ ఫండింగ్ ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని, అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధాంతాన్ని బలంగా ఆచరణలో పెట్టడానికి కూడా క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా అవసరమని తెలియజేసారు. జన విరాళాలు కచ్చితంగా అందర్నీ ఐక్యమత్యంగా ఉంచేవని, ఎవరి పరిధిలో వారు పార్టీ నిర్వహణ కోసం ఇచ్చే విరాళాలు ఒక రకమైన భావోద్వేగం తో ముడిపడి ఉంటాయని, కొత్త వ్యక్తులు సైతం పార్టీకి అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుపారు. కనీసం 10 రూపాయలు దగ్గర నుంచి విరాళాలు ఇచ్చే వెసులుబాటు కల్పించడం ద్వారా పేదలు, దిగువ మధ్యతరగతి వారు సైతం పార్టీకి ఆనందంతో తమకు తోచిన సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని వల్ల పార్టీ మరింత ప్రజా బాహుళ్యంలోకి వెళ్తుందని, క్రౌడ్ ఫండింగ్ విధానం వల్ల పార్టీని పూర్తిస్థాయిలో భుజాన వేసుకొని ముందుకు నడిపిస్తున్న వారికి ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని, అప్పుడు కచ్చితంగా పూర్తి స్థాయిలో పార్టీ మీద అధినేతకు ఫోకస్ ఉంటుందని తెలిపారు. పెనుమూరు మండల ప్రజలు జనసేన పార్టీ, 7288040505, 7288040505@upi నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పే టియం ద్వారా పది రూపాయల నుండి ఎంతైనా సహాయం అందించ గలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్వేటినగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, నాయకులు పుష్పరాజ్, కిరణ్, సురేంద్ర, ప్రసాద్, పద్మనాభం, గణేష్, నవీన్, కిరణ్ కుమార్, తరుణ్, నవీన్ గుణ శేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com