Logo
Date of Publish : 28 November 2025, 7:29 pm
Editor : Sake Naresh

కందుకూరు గ్రామంలో అరటి రైతులకు పంటపై అవగాహన కార్యక్రమం

అనంతపురం, అక్టోబర్ 27, (జనస్వరం) : ఈ రోజు అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం మండలం ఉద్యాన అధికారి వై. రత్నకుమార్ ముఖ్య అతిథిగా హాజరై, అరటి సాగు చేస్తున్న రైతులకు పంట యాజమాన్య పద్ధతులపై సమగ్రంగా వివరించారు. అరటి పంటలో సంక్రమించే సిగటోకా ఆకుమచ్చ తెగులు, తేమ కారణంగా ఏర్పడే సమస్యలపై రైతులతో చర్చ జరిపారు. వాతావరణం తేమగా ఉన్నప్పుడు మాత్రమే సిగటోకా వ్యాప్తి చెందుతుందని, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పంట ప్రారంభ దశలో తోటను శుభ్రపరిచి సానిటైజేషన్ చేయడం ద్వారా తెగుళ్లను నియంత్రించవచ్చని తెలిపారు. ఇందుకు పాండాప్, కాన్ఫిడార్ 0.50 మిల్లీ లీటర్, ప్రొపికొనజోల్ వంటి మందులను సరైన మోతాదులో వినియోగించాలని వివరించారు. సిగటోకా నివారణకు టిల్ట్ పిచికారీ చేసినటువంటి మందులను స్ప్రే చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రైతులు పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, తమ ఫీల్డ్ అనుభవాల ఆధారంగా మెరుగైన పంట సాధించే మార్గాలపై చర్చ జరిగింది.ఎ రువుల యాజమాన్యంలో భాగంగా 13-0-45, Fe-CN, 0-0-50 ఎరువులను సరైన సమయంలో వినియోగించాలని సూచించారు. ప్రతి నెల ఫార్ములా 4 రెక్సోలిన్ ఫోలియర్ స్ప్రే చేయడం వల్ల నాణ్యమైన దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆరు నెలల లోపు పంటకు 19.19.19 + 1 శాతం ఎస్‌ఓఎల్ (గ్రూప్-1), ఆరు నెలలు దాటిన పంటకు 10.05.36 (గ్రూప్-2) ఎరువుల వినియోగంపై స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన ఇంచార్జ్ మల్లికార్జునతో పాటు కందుకూరు గ్రామానికి చెందిన పలువురు అరటి రైతులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com