– ఖుద్దూస్ రోడ్డుగా నామకరణం చేయడానికి వ్యతిరేకిస్తే వారు ముస్లిం మైనారిటీ ద్రోహులే.
– 3 నెలల కిందట అక్రమ నిర్మాణం నేడు సక్రమ నిర్మాణం అయిందా కమిషనర్ స్వప్నిల్ దీనకర్
– భారీ అక్రమ కట్టడాన్ని కూల్చకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటే కమిషనర్ స్వప్నిల్ దీనకర్ కి ఈ అవినీతిలో భాగస్వామ్యం ఏంత ?
– ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు అడుగడుగున గుంటనక్కల్లా కాసుకొని ఉన్నారు
– కార్పొరేటర్ చైతన్య రెడ్డి బ్యానర్ల మీద తప్పించి ప్రజల మధ్య కనపడటం లేదు
– ఫోటోలకి ఫోజులు ఇవ్వడం కాదు.. ప్రజా సమస్యల్ని స్థానిక కార్పొరేటర్ పరిష్కరించాలి
– వారాహిని చూస్తే వైఎస్ఆర్సిపి నాయకులకు వడదెబ్బ తగులుతుంది
విజయవాడ, (జనస్వరం) : ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం 42వ డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్ అనూష ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భవానిపురం ప్రియదర్శిని కాలనీలో పర్యటించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజలు మహేష్ తో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇల్లు ఇస్తామని హామీ పత్రాలు ఇచ్చారని, నేటి వరకు మాకు ఇల్లు చూపించకుండా మోసం చేస్తున్నారని, మా సొంత ఇంటి కలని కలగానే మిగిల్చి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, అకారణంగా సాకులు చూపుతూ పెన్షన్లు తొలగించారని, ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వలస వచ్చిన యాదవ రాజు మాట్లాడుతూ విజయవాడలో బ్రతుకుదాం అనుకుంటే ఇక్కడ ఉపాధి లేక తిరిగి మా సొంతప్రాంతాలకు వెళ్ళిపోతే అద్దెబారాలైన తగ్గుతాయని ఆవేదన వెలిబుచ్చారని, ఇసుక దొరక్క పోవడం వలన వారానికి కేవలం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే పనులు చేసుకుంటున్నామని అందువల్ల ఇల్లు గడడం చాలా కష్టంగా ఉందని, నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయని ఆదాయం సరిపోక నానా అవస్థలు పడుతున్నామని, అద్దెదారులకు కూడా కరెంటు బిల్లు సాకుగా చూపించి పెన్షన్ రద్దు చేయడం అత్యంత దారుణమని స్థానికులు మహేష్ వద్ద వాపోయారు.
• ఖాళీ స్థలం కనబడితే కబ్జా :
ట్రెండ్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం హౌసింగ్ బోర్డ్ చెందిందని ఈ ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడానికి అధికార పార్టీ నాయకులు నానా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని అందుకనే ఇక్కడ చెత్తతో నింపుతున్నారని స్థానికులు తెలియజేశారు. అదేవిధంగా ప్రియదర్శిని కాలనీలో మరొక మహిళ నా కూతురు అల్లుడు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మహేష్ దృష్టికి తీసుకువచ్చారు. మీడియా పాయింట్ వద్ద మహేష్ మాట్లాడుతూ క్రాంబే రోడ్డు బ్రిటిష్ వారు పెట్టిన పేరని అందువల్ల ఈ పేరును తొలగించి ఎస్ఎంఎ కుద్దూస్ గా నామకరణం చేయాలని 2005 – 2010 మధ్య కౌన్సిల్లో తీర్మానం చేశారని, కానీ స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఈ పేరుని తీసివేయాలని వేరొక పేరుని ప్రతిపాదించారని, ఇది చాలా అన్యాయం అని కుద్దూస్ పేరుని వ్యతిరేకిస్తే స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి ముస్లిం మైనారిటీల ద్రోహేనని, 43వ డివిజన్లో 3 నెలల కిందట అక్రమ నిర్మాణమని వీఎంసీ అధికారులు ఒక భారీ కట్టడాన్ని తొలగించారని కానీ నేడు ఎందుకో ఆ నిర్మాణం సక్రమమైపోయిందని కొట్ల రూపాయల కార్పొరేషన్ కు ఫీజులు ఎగ్గొట్టిన ఎందుకు వియంసి అధికారులు కూల్చడం లేదో నగర ప్రజలకు సమాధానం చెప్పాలని, ఈ రోజున ఈనాడు పేపర్ మొదటి పేజీలో ఈ వార్త వచ్చిందని కమిషనర్ స్వప్నిల్. దీనకర్ ఈ అంశంపై స్పందించడం లేదంటే వారికి ఈ అక్రమ కట్టడంలో అవినీతి పైసలు అంది ఉంటాయని అనుమానించాల్సి వస్తుందని, మేనిఫెస్టోలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత ఇసుక అంశాన్ని, యువతకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఏడాదికి వడ్డీ లేని పది లక్షల రుణాన్ని అందించే అంశాలను ప్రజలకు మహేష్ తెలియజేశారు, ఎన్ని విమర్శలు చేసినా ప్రచారాన్ని మరింత ఉధృతి చేస్తామని, వైఎస్ఆర్సిపి నాయకుల అవినీతి చెత్త తయారు చేస్తున్నామని తొందరలోనే వారి నిజస్వరూపాన్ని బయటపెడతామని మహేష్ హెచ్చరించారు. స్థానిక డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్ అనూష మాట్లాడుతూ వైసీపీకి ఓటేసినందుకు మా భవిష్యత్తు గందరగోళం అయిందని, 4 సంవత్సరాలలో ఒక్క మంచి పని కూడా చేయలేదని, ప్రజలు వారి సమస్యలు తెలియజేస్తుంటే కళ్ళంబట నీళ్లు వస్తున్నాయని అయినా వైసీపీ నాయకుల హృదయం కరగడం లేదని, స్థానిక కార్పొరేటర్ బ్యానర్ల మీద తప్పించి ప్రజల మధ్య ఏనాడు కనబడడం లేదనీ, ప్రజా మద్దతు దమ్ముంటే గెలవాలి ధన బలంతో కాదు, వారాహిని చూడంగానే వైసీపీ నాయకులకు వడదెబ్బ తగిలింది, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తద్యమని పశ్చిమంలో పోతిన మహేష్ గెలుపు నల్లేరు మీద నడకేన్ననారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పగడాల సుబ్బారావు, ఆవుల ప్రసాద్, రామచంద్ర రావు డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, రెడ్డిపల్లి గంగాధర్, సిగానంశెట్టి రాము, పొట్నురి శ్రీనివాసరావు, మల్లెపు విజయలక్ష్మి, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, జేల్లి రమేష్, వెన్న శివశంకర్, స్టాలిన్ శంకర్, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు.