గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : ఎస్ ఆర్ పురం మండలం, జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద మూలూరులో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రతిస్పందనగా, నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామీ ఓ జిత్తులమారి నక్కఅని, సీటు రాదన్న బెంగతో పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విధంగానైనా ఎమ్మెల్యే సీటు పొందాలనే తపన, ఆరాటం నారాయణ స్వామికి రాను రాను ఎక్కువ అయిందని ఏద్దేవా చేసారు. గతంలో రాష్ట్రం లో కొంతమంది ఎమ్మెల్యే లు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేసి పదవులు పొందినారని గ్రహించి, స్వామీకి డెబ్భై పదుల వయస్సులో ఆశ ఎక్కువై ఈ విధంగా ప్రవర్తించడాన్ని మానసిక లోపం అంటారని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆనాడు ఎస్ ఆర్ పురం మండలానికి కేటాయించిన జడ్పీటీసీ ఎస్సి లకు కేటాయిస్తే దానిని కార్వేటి నగరానికి కేటాయించి, కర్వేటినగరానికి కేటాయించిన జనరల్ కేటగిరిని ఎస్సార్ పురానికి ఎందుకు కేటాయించావు? దీనికి కార్వేటినగరం మండల ప్రజలకు, ఎస్సార్ పురం మండల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీకు ఈ సారి సీటు రాదు, ఒకవేళ వచ్చినా నువ్వు ఓడిపోవడం ఖాయం, అందుకే నీకు ఒక ఉచిత సలహా ఇంటికి పోయే ముందు కార్వేటి నగరం నుండి పచ్చికపాల్లం, వెదురు కుప్పం, దేవళంపేట మీదుగా కొత్తపల్లి మిట్ట వరకు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ చేయాలనీ, కార్వేటి నగరం, వెదురు కుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపే ప్రతిపాదన జరిగేటట్టు చెయ్యమని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్ర బాబు అనుభవం తో రానున్న ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావడం కూడా ఖాయమని తెలిపారు. ఆ తరువాత ఎవరు ఎంత ప్యాకేజి తీసుకున్నారు? ఏ ఏ సందర్భాల్లో ప్యాకేజి తీసుకున్నారు? వారు కట్టిన ఇంటికి సిమెంట్ ఎంత వాడారు? ఇటుక ఎంత ఉపయోగించారు? స్విమ్మింగ్ పూల్ కి అయిన ఖర్చు అయింది? సిబిఐ ఎంక్వయిరీ వేసి, ఇత్యాది వివరాలతో సహా బొక్కలో తోసి, బొక్కిన ప్రజాధనం ఎంతో లెక్కతో సహా రాబట్టి ప్రజలకు పంచుతామని ఈ సందర్బంగా ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జీడీ నెల్లూరు మండల బూత్ కన్వినర్ తులసి రామ్, కార్వేటి నగరం టౌన్ కమిటీ ప్రెసిడెంట్ రాజేష్, వెదురు కుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాదం నాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శులు భాను ప్రసాద్, రాఘవ, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సురేష్, యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బుల్లెట్ శీను, నియోజకవర్గం బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, ఎస్ ఆర్ పురం మండల ఉపాధ్యక్షలు చార్లెస్, కార్వేటి నగరం మండలం ఉపాధ్యక్షలు సురేష్ రెడ్డి, విజయ్, ప్రధాన కార్యదర్సులు నరేష్, సూర్య నరసింహులు, జీడీ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు రషీద్, పాలసముద్రం మండల ఉపాధ్యక్షులు రాఘవ, వెదురు కుప్పం ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి ముని, కార్వేటినగరం మండల కార్యదర్శి మహేందర్, సీనియర్ నాయకులు నాగరాజు, భరత్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com