Search
Close this search box.
Search
Close this search box.

వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరలి౦చేందుకే పవన్‌పై విమర్శలు

వివేకా హత్య

       ధర్మవరం ( జనస్వరం ) :  రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే వైసీపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం చిలకం మధుసూదన్‌ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు లో ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి తో పాటు మరికొందరి వైయస్‌ జగన్‌ కుటుంబానికి సంబంధించిన పేర్లు సిబిఐ విచారణలో బయటపడుతుండడంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిని మరలించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వచ్చిన ప్రతిసారి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కు రావలసిన పెట్టుబడుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తనస్త స్వప్రయోజనాల కోసం ఢిల్లీ యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తే దానికి సరైన సమాధానం చెప్పలేక వైసీపి మంత్రులు వెనకడుగు వేస్తున్నారని ఇలాంటి తరుణంలో బాధ్యతగల రాజకీయ నాయకుడిగా పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ, ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా వైసీపీ మంత్రులు విమర్శించాలని సలహాఇస్తే పాటించడం పోయి పవన్‌ కళ్యాణ్‌ పైనే రాజకీయంగా దాడి చేయడం వైసిపి నాయకులకు మంత్రులకు సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఓటమి భయంతో రాష్ట్రంలో ఇంటింటికి జగన్‌ స్టిక్కర్లను అతికిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏం సాధించారని జగన్‌ స్టిక్కర్లు అతికిస్తున్నారని కనీసం ప్రత్యేక హోదా కూడా తీసుకురాని వైసీపీ ఎంపీలు, మంత్రులు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. సొంత చిన్నాన్ననే చంపిన కేసుతోపాటు, సొంత చెల్లెలు, తల్లి కే న్యాయం చేయలేని సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా అక్రమాస్తుల సంపాదించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతిలోనూ, భూకబ్జాల్లోనూ, అక్రమాల్లోనూ నెంబర్‌ వన్‌ గా నిలిచారన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి మద్యాన్ని రాష్ట్ర ఆదాయ వనరులుగా మార్చుకొని ప్రజలకు కల్తీ మద్యాన్ని అందిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే సరైన రీతిలో సీఎం జగన్మోహన్‌ రెడ్డికి బుద్ధి చెప్తారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 20 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగేళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా తేవడంలో వైఫల్యం చెందారని, తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాష్ట అవసరాలను గాలికి వదిలేసారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way