Logo
Date of Publish : 03 June 2026, 11:28 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు మానుకోవాలి: వాసగిరి మణికంఠ

గుత్తి, మే 31 (జనస్వరం) : దేశ సమగ్రత కోసం పని చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌పై ప్రాంతీయ, కుల విద్వేషాలను రెచ్చగొట్టేలా జరుగుతున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ అన్నారు. శనివారం గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కావాలనే వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న రోడ్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అటవీ శాఖ సంస్కరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో సేవలు చేశారని, కొండగట్టు ఆలయ అభివృద్ధి, వరద బాధితులకు ఆర్థిక సహాయం, ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని అడ్డుకునేందుకు కొందరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, వీరమహిళ రాజేశ్వరి, జనసేన నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, గోరంట్ల నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు, ఓబులేసు, అశ్వ నాగప్ప, హసన్, ధను, గద్దల కార్తీక్, ఫిరోజ్ నాయక్, రమేష్, రవి ప్రకాష్, గాజుల రాఘవేంద్ర, కథల వీధి అంజి, సుంకర నాగరాజు, రామాంజనేయులు యాదవ్, విజయ్, అమర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com