
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో, మండల స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. కృష్ణాపురం జనసైనికులకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ గారు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. కాంతిశ్రీ గారు మాట్లాడుతూ టీం అందరికీ అభినందనలు చెబుతూ మీ టీం అందరూ కలిసి మండల స్థాయి కప్పును కృష్ణాపురం పంచాయితీకి తీసుకొని వచ్చేలా గెలవాలని చెప్పారు. సేవా రంగంలోనే కాకుండా, క్రీడా రంగంలో కూడా జన సైనికులు ముందుకు రావాలని రాష్ట్ర, జాతీయ స్ధాయిలో శ్రీకాకుళం జిల్లాకు పేరు తీసుకురావాలని కాంతిశ్రీ గారు తెలియజేయడం జరిగింది. గ్రామీణ స్థాయిలో కూడా యువత తమ క్రీడా నైపుణ్యం బయటకు తీయాలని, అలాగే క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ MPTC అభ్యర్థి లక్ష్మినాయుడు గారు, శంకర్, బాబాజీ, జయప్రకాశ్ పాల్గొన్నారు.